‘తన పాలన ప్లాప్ అని తానే చెప్పుకున్న సీఎం అతడే’..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏమాత్రం ముఖ్యమంత్రి పదవికి తగనని తానే చెప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం పిచ్చోడి చేతిలా రాయిలా తయారయ్యిందన్నారు. రేవంత్ అప్రూవర్‌గా మారి తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం రూ. 71 వేల కోట్ల రెవెన్యూ తీసుకురాలేమని ఒప్పుకున్నాడని, రాష్ట్రం దివాలా తీసిందని, లక్ష కోట్ల అప్పులున్నాయని అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడాది పాలనలో పాస్ మార్కులు కూడా రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అన్నారు. కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్ నేతలపై కోపంతో రైతులను గోస పెడుతున్నాడు. ముఖ్యమంత్రి అయ్యుండి, రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చడం ఎంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.