Andhra PradeshHome Page Slider

పొగమంచు, వర్షంతో పాపవినాశనం మార్గాల మూసివేత

తిరుమల: పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తితిదే మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుండి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. పొగమంచుతో శక్రవారం తెల్లవారు జాము నుండి ఆలయం సమీపంలోని భక్తులతోపాటు ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులను తితిదే సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు.