ముఖ్యమంత్రి విచారణకు రావల్సిందే..కోర్టు అసహనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నేడు కేసు విచారణ జరగగా నిందితులు ఎవ్వరూ రాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అక్టోబర్ 16నాటికి కేసును వాయిదా వేస్తూ అప్పుడు తప్పకుండా విచారణకు రావాలని సూచించింది.