తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం..
సచివాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అయితే.. ఇవాళ వరుస సమీక్షలతో సీఎం రేవంత్ బిజీ బిజీగా గడిపారు. ఫార్మాకంపెనీలతో ఎంఓయూలు, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష, మెట్రో రైలు విస్తరణపై సమీక్షించారు. రాత్రి 7 గంటలకు గచ్చిబౌలి లే మెరిడియన్ హోటల్లో కామన్వెల్త్ మీడియేషన్ -ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ కు సీఎం రేవంత్ హాజరు కానున్నారు.