బాయ్స్ కష్టాలను కళ్లారా చూసి చలించిపోయిన సీఈవో
దేశంలో స్విగ్గీ, జోమాటో గురించి తెలియనివారుండరు. ఆ రెండు కంపెనీలు దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీలో అంత పాపులర్ అయ్యాయి. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కోట్లు సంపాదిస్తున్నారని చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నా, అందులో లోతు కొందరికే తెలుసు. గురుగ్రామ్‌లోని ఓ మాల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఫుడ్ ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు లిఫ్టును ఉపయోగించకుండా ఆపేశారని లోబోదిబోమన్నారు జోమాటో సీఈవో దీపేందర్ గోయల్. భార్య గ్రీసియాతో కలిసి డెలివరీ బాయ్ అవతారమెత్తి, ఆ కష్టాలను తెలుసుకున్నారు. మాల్స్‌తో ఎలా డీల్ చేయాలన్నదానిని తెలుసుకునేందుకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. డెలివరీ సమయంలోనైనా బాయ్స్‌కు లిఫ్టులు ఉపయోగించేలా అవకాశమివ్వాలన్నారు.

