Home Page SliderNational

దేశంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వం దేశంలో నిగుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9,64,359 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. అయితే గ్రూప్-Aలో 30,606 పోస్టులు, గ్రూప్-Bలో 18,011 పోస్టులు, గ్రూప్-Bలో 93,803 నాన్ గెజిటెడ్ పోస్టులు ,గ్రూప్-Cలో 8,21,939 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు  కేంద్రమంత్రి వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రైల్వేలో 3,09,074 పోస్టులు,రక్షణ రంగంలో 2,32,134 పోస్టులు ,హోంశాఖలో 1,20,933 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే ఖాళీగా ఉన్న ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్ని శాఖలను ఆదేశించామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ స్పష్టం చేశారు.నిన్నటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో కేంద్ర కేబినెట్ పలు కీలక  అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.