పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ అమలలులో 6.50 పనిదినాలను కేంద్రం అదనంగా కేటాయించినట్లు పేర్కొంది. తన విన్నపాన్ని కేంద్రం అంగీకరించిందని, దీనివల్ల 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరబోతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి విడతలో 15 కోట్ల పనిదినాలు కేటాయించగా, అవి జూన్ నెలాఖరుకే పూర్తయ్యాయి. దీనితో అదనపు పనిదినాలు ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పవన్.

