లోయలో పడ్డ బస్సు..ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్ నైనిటాల్ అమ్డాలి సమీపంలో బస్సు ప్రమాదానికి గురయ్యింది. 27 మంది ప్రయాణికులతో భీమ్ టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తూ అదుపు తప్పి లోయలో పడింది. 1500 అడుగుల లోయలో పడిన ఈ దుర్ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్‌లో తన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తక్షణమే సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

