బస్సు డ్రైవర్ కు గుండెపోటు.. తర్వాత ఏమైందంటే..
ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.. బస్సును కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కన ఉన్న కార్లు, బైకులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళుతుంది. మంచిర్యాల ఐబీ చౌరస్తా దగ్గరకు రాగానే.. బస్సు డ్రైవర్ ఎల్లయ్య గుండెపోటుకు గురయ్యాడు. బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో బస్సు కార్లు, బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా.. ఓ బైక్ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ ఎల్లయ్యను ప్రయాణికులు ఆస్పత్రికి తరలించారు.

