అకస్మాత్తుగా కూలిన భవనం… పలువురికి తీవ్ర గాయాలు
కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో పని చేస్తున్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో ఉన్న భవనం 4వ అంతస్థు స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు కూలీలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని… ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

