పెళ్లికొడుకు చెంపచెళ్లుమనిపించిన పెళ్లికూతురు..ఎందుకంటే..
‘అతి సర్వత్రా వర్జయేత్’ అంటారు పెద్దలు. వినోదం కొంతవరకే బాగుంటుంది. ఓవరాక్షన్ చేస్తే చెంపదెబ్బలు తినాల్సిందే. ఇలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక పెళ్లి కొడుకు వధువును పెళ్లి వేడుకలో అతిగా ఆటపట్టించాడు. పెళ్లి తంతుల్లో మరి ఎన్నిసార్లు విసిగించాడో ఏమో, ఆమె విసుగు చెందింది. చివరికి వివాహం పూర్తయ్యాక పెళ్లికుమార్తె వరుడికి లడ్డూ తినిపించవలసి వచ్చింది. ఈ తంతులో రెండు మూడుసార్లు తప్పించుకుంటూ ఆమెను ఆటపట్టించాడు. దీనితో పెళ్లికుమార్తె సహనం నశించి, లడ్డూ నోట్లో కుక్కి, చెంప చెళ్లుమనింపించింది. ఈ సంఘటనపై నెటిజన్లు పెళ్లికుమారుడి ఇజ్జత్ పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అమ్మాయే మా ఫ్రెండుకు కూడా భార్య కావాలి అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.