జేసీబీని డ్రైవ్ చేసిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..
ఓ మైనర్ బాలుడు జేసీబీని డ్రైవ్ చేశాడు. అది కాస్తా అదుపు తప్పి రోడ్డుపై ఉన్న జేసీబీతో ఢీకొట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. అక్కడ తవ్వకాలు జరిపే జేసీబీని 17 సంవత్సరాల మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కనే పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. సెల్లూరు అనే ప్రాంతంలో సుమారు అర కిలో మీటరు దూరం వరకు జేసీబీని డ్రైవ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.