మౌంట్ డెనాలి పర్వతాన్ని అధిరోహించిన బాలుడు
హైదరాబాద్: బాలానగర్ ఫిరోజ్‌గూడకు చెందిన 11వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు పడకంటి విశ్వనాథ్ కార్తికేయ నార్త్ అమెరికా అలస్కాలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒక్కటైన మౌంట్ డెనాలిని అధిరోహించి రికార్డు సాధించాడు. ఈ నెల 15న పర్వతారోహణం ప్రారంభించిన ఈ బాలుడు 9 రోజుల్లో అంటే 23వ తేదీ నాటికి మొత్తం 6,190 మీటర్లు (20,310 అడుగులు) ఎత్తు ఎక్కాడు. అక్కడ భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు.

