ఈడీకి జరిమానా విధించిన బాంబే హైకోర్టు
ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద ఈడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.ఆర్ధిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది.దీంతో సదరు వ్యాపారి ఈడి కేసును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు.పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు…ఈడికి మొట్టికాయలు వేసింది. ఒప్పందాన్ని మాత్రమే ఉల్లంఘించారని,ఇందులో అసలు మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందంటూ ఈడిని ప్రశ్నించింది.అంతే కాదు..ఇలాంటి తప్పుడు కేసులు చేపట్టినందుకు ఓ రూ.లక్ష జరిమానా కూడా విధించింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సామాన్యులు,మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించింది.