బీజేపీ నన్ను వదులుకోదు
ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయి రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌పై రాజాసింగ్ స్పందించారు. “పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వీలైనంత త్వరగా సమాధానం ఇస్తాను. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని భావిస్తున్నాను. పార్టీ నన్ను వదులుకోదు అని అనుకుంటున్నాను. బండి సంజయ్‌పై పూర్తి నమ్మకం ఉంది. నేను చేసిన వీడియో ఏ మతాన్నీ కించపర్చలేదు. కోర్టు పరిమితుల దృష్టా ఎక్కువగా మాట్లాడలేను. మిగతా పీఎస్‌లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాను“ అని రాజాసింగ్ పేర్కొన్నారు.

