బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం
దుబ్బాక: మంత్రి హరీష్‌రావు కల్లబొల్లి కబుర్లు, మాటలు, జిమ్మిక్కులు దుబ్బాకలో చెల్లవని.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి దుబ్బాక, సిద్దిపేట రెండు కళ్లు అని చెప్పడమే తప్ప హరీష్‌రావు ఎప్పుడూ అభివృద్ధికి కృషి చేసింది లేదని బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ ఒగ్గు తిరుపతి, చాకలి ఆగయ్య, ముదిరాజు సంఘం మాజీ అధ్యక్షుడు కంకణాల పెద్ద బాలయ్య, కొండె రాజిరెడ్డి, పద్మారెడ్డి తదితరులు దుబ్బాకలోని 17, 19 వార్డులకు చెందిన ప్రజలు, పద్మనాభంపల్లికి చెందిన పలువురు నాయకులు, యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.


 
							 
							