Home Page SliderTelangana

ముస్లీంల‌కు అన్యాయం చేసే బిల్లును ఉపసంహ‌రించుకోవాలి..

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేంగా ముస్లీంలు చేప‌ట్టిన నిర‌స‌న‌కు ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీఖాన్ సంఘీభావం తెలిపారు. ఆసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి తో క‌లిసి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా చాందా (టీ) ద‌ర్గా ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన ఆందోళ‌న‌కు భారీ సంఖ్య‌లో ముస్లీంలు కాంగ్రెస్ శ్రేణులు హాజ‌ర‌య్యారు. ముస్లీంల‌ను అన్యాయం చేసే వక్ఫ్ సవరణ బిల్లును వెంట‌నే ఉప సంహ‌రించుకోవాల‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.