Home Page SliderNational

తనపై వస్తున్న తప్పుడు వార్తలను తిప్పికొట్టిన బిగ్‌బాస్ విన్నర్

ఇటీవల బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన తాజాగా స్పందించి.. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు  తాను ఎక్కడికి వెళ్లలేదని,ఇంటి దగ్గరే ఉన్నానని తెలియజేస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కాగా ఈ వీడియోలో “నా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే నన్ను క్షమించండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు. కావాలనే నాపై తప్పుడు ప్రచారం చెస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్లను. నేను ఫోనే వాడట్లేదు. ఇదే నిజం. నా గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకండి.నాతో మీరంతా ఉంటే చాలు” అని పల్లవి ప్రశాంత్ స్పష్టం చేశారు. దీంతో ఆయనపై వస్తోన్న తప్పుడు ప్రచారానికి కళ్లెం పడినట్లైంది.కాగా ఆదివారం బిగ్‌బాస్  విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. అయితే ఆయన విన్నర్‌గా బయటకు వచ్చిన తర్వాత పోలీసుల అనుమతి లేకుండా తన అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పల్లవి ప్రశాంత్ అభిమానులు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల కార్ల అద్దాలు,ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం పగుల గొట్టారు. కాగా దీనిపై సీరియస్ అయిన  హైదరాబాద్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై  కేసు నమోదు చేశారు.