BCCI లిస్ట్ వచ్చేసింది.. వీరే అగ్ర క్రికెటర్లు
ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల లిస్టును BCCI విడుదల చేసింది. అగ్ర క్రికెటర్లుగా ఈ లిస్టులో ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా, రవీంద్ర జడేజా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం లభిస్తుంది. రోహిత్, కోహ్లి, జడేజాలు టీ20లకు వీడ్కోలు పలికినా టాప్ గ్రేడ్‌లో కొనసాగడం విశేషం. ఏ గ్రేడ్‌లో సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, పాండ్య, షమీ, పంత్ ఉన్నారు. వీరికి రూ.5 కోట్ల చొప్పున వేతనం లభిస్తుంది. ఇతర యువ క్రికెటర్లు గ్రేడ్ బి, గ్రేడ్ సిలలో కాంట్రాక్టులు దక్కించుకున్నారు. గ్రేడ్ బికి రూ.3 కోట్లు, గ్రేడ్ సి కి రూ. కోటి వేతనం చెల్లిస్తారు.

