కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి సూత్రధారి గటాని రాజు నేపథ్యమిదే…!?
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. నిన్న ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన గటాని రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ నాయకులు సైతం దీనిపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. అయితే ఇటీవల గటాని రాజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆయన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఐతే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఆయన దాడి ఎందుకు చేశారన్నదానిపై మాత్రం క్లారిటీ మిస్సవుతోంది. ఆయన దళితుడని, దళితబంధు రాలేదన్న ఆవేదన ఉందని చెబుతున్నారు. వాస్తవానికి గటాని రాజు యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారంటున్నా.. ప్రస్తుతం ఆయన ఆ యాక్టివిటీస్ ఏమీ కూడా చేయడం లేదని తెలుస్తోంది. తాను మీడియా పర్సన్ అని చెప్పుకొని పబ్బం గడుపుకుంటాడని తెలుస్తోంది.