BusinessHome Page SliderInternationalLifestylemovies

అట్ట‌హాసంగా ఆస్కార్ అవార్డుల ప్ర‌దానం

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 97వ అకాడమీ అవార్డుల వేడుకల కోసం హాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త ట్రెండీ దుస్తులలో కనిపించి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‏లో అట్టహాసంగా జరిగింది. ఎమిలియా పెరెజ్ 13 మంది ఆస్కార్ నామినీలతో అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రం నామినీలలో “అనోరా”, “ది బ్రూటలిస్ట్”, “ఎ కంప్లీట్ అన్ నోన్”, “కాన్క్లేవ్”, “డ్యూన్: పార్ట్ టూ”, “ఎమిలియా పెరెజ్”, “ఐ యామ్ స్టిల్ హియర్”, “నికెల్ బాయ్స్”, “ది సబ్‌స్టాన్స్”, “వికెడ్” పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుకల ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రాంతాలలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మన దేశంలో జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.ఈ షోను మొదటిసారిగా లేట్ నైట్ హోస్ట్ కోనన్ ఓ’బ్రెయిన్ హోస్ట్ చేస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఎమిలియా పెరెజ్ పాట ఎల్ మాల్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటను జోయ్ సల్దానా, కార్లా సోఫియా గాస్కాన్ ఈ చిత్రంలో ప్రదర్శించారు. ఉత్తమ ఎడిటింగ్ ఆస్కార్ అవార్డు అనోరాకు దక్కింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 2 అవార్డులు వచ్చాయి. కాన్‌క్లేవ్ చిత్రానికి గాను పీటర్ స్ట్రాఘన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకున్నారు. అనోరా చిత్రానికి సీన్ బేకర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును గెలుచుకున్నాడు.