Home Page SliderNational

ఆ సినిమా చూసి చలించిపోయిన ఆడియన్స్

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే చావా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీని చూసేందుకు అభిమానులు భారీగా థియేటర్ లకు వస్తున్నారు. దీనిలో శంభాజీ మహారాజ్ గా.. విక్కి కౌశల్, యేసుబాయ్ గా రష్మిక మందన్న నటించారు. ఈ సినిమాలో విక్కి కౌశల్ శంభాజీ మహారాజ్ గా అదరగొట్టారని అభిమానులు చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా చూసిన ప్రేక్షకులు చలించిపోయారు. ప్రేక్షకులు కన్నీళ్లతో, బరువెక్కిన గుండెతో సినిమా చూసి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం “చావా” చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.