చిలుకూరు ఆలయ అర్చకునిపై దాడి హేయం
దక్షిణభారతదేశ మహానగారాల్లోనే సుప్రసిద్ధ ఆలయమైన శ్రీచిలుకూరి బాలాజి ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి హేయమని మాజీ మంత్రి కేటిఆర్ అన్నారు.ఏపికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచార నాయకులు వీరరాఘవ అనే వ్యక్తి ఆలయానికి వచ్చి రంగరాజన్‌తో మాట్లాడారు.ఆయన మాట వినకపోవడంతో రంగరాజన్‌పై దాడి చేశారు.ఈ నేపథ్యంలో కేటిఆర్ సోమవారం ఆలయ సందర్శన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఉన్నారు.జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయని ధ్వజమెత్తారు. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదన్నారు.దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

