ఆలయంలోని 6 హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు
తెలంగాణలోని ఘట్ కేసర్ గట్టు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గట్టు మైసమ్మ ఆలయంలో తాళాలు పగలగొట్టి 6 హుండీలను దొంగలు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో రెండు హుండీలు దొంగలు పడేశారు. ఆలయ ఆరు హుండీలు రెండు నెలలుగా లెక్కించలేదని ఆలయ సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.