యాంకర్ సుమకి ముద్దు పెట్టిన నటుడు..
తమిళ హీరో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం తంగలాన్. ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వం చేస్తున్నారు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, హాలీవుడ్ నటుడు డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే, ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తెలుగులో భారీ ఎత్తున్న నిర్వహించారు. ఇక ఈ వేడుకకు విక్రమ్‌తో పాటు దర్శకుడు పా.రంజిత్ తదితరులు హాజరై సందడి చేశారు.
ఇదిలావుంటే ఈ వేడుకలో యాంకర్ సుమను ముద్దు పెట్టుకున్నాడు హాలీవుడ్ నటుడు డానియెల్ కల్టగిరోన్. డానియెల్ కల్టగిరోన్ తంగలాన్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే డానియెల్ వేదిక మీదకి వచ్చి సినిమా గురించి చెప్పిన అనంతరం కిందకి వెళుతూ.. సుమ చేయిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో సడన్‌గా షాక్ తిన్న సుమ రాజా (రాజీవ్ కనకలా) ఇతడు మా అన్నయ్య రాఖీ పండగ వస్తోంది కదా అంటూ డానియెల్‌ను చూపిస్తూ అంది.