home page sliderHome Page SliderTelangana

దర్జాగా హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయాడు..

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. పొలం పనులకు వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న మహిళను నడి రోడ్డుపై దారుణంగా కత్తితో గుర్తుతెలియని వ్యక్తి నరికి చంపాడు. దర్జాగా హత్య చేసి.. ఆమె తలను నరికేసి.. ఆమెను చంపింది నేనే అంటూ.. పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. గతంలోనూ వినాయక చవితి రోజు ఒక వ్యక్తిని నిందితుడు హత్య చేశాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.