NationalNews

అందుకే ఉద్ధవ్ ను దించేశాం

బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో దేన్నెనా భరించవచ్చుగాని.. నమ్మకద్రోహాన్ని సహించలేమన్నారాయన. ఉద్ధవ్ థాక్రే బీజేపీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమేనని.. థాక్రేకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు అమిత్ షా. శివసేన పార్టీలో పలు పరిణామాలకు ఉద్ధవ్ థాక్రే కారణమన్నారు. రాజకీయాల్లో మోసం చేసిన వాళ్లకు శిక్షపడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ లా తమకు మోసం చేయడం రాదని.. తమకు తెలిసింది ఓపెన్ పాలిటిక్స్ అని అమిత్ షా పేర్కొన్నారు. ఉద్ధవ్ థాక్రేను సీఎం చేస్తామని ఏనాడు తాము చెప్పలేదన్నారు అమిత్ షా.