‘విజయసాయి అందుకే రాజీనామా చేశారు’.జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మద్యం స్కామ్ పేరుతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ విజయసాయి రెడ్డిని లొంగదీసుకున్నారని, చంద్రబాబు మేలు కోసమే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. అసలు చంద్రబాబు పాలన కాలంలోనే 2014 నుండి 19 మధ్య మద్యం కుంభకోణం జరిగిందని, ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారని తెలుసా అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలన కాలంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తే లంచాలు ఎవరిస్తారన్నారు. అసలు లిక్కర్ ఫైల్ ఒక్కటైనా సీఎంవోకు వచ్చినట్లు చంద్రబాబు నిరూపించగలరా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి, మద్యం షాపులు దోచుకున్నారని, ప్రైవేట్ సిండికేట్‌లకు లబ్ధి చేకూర్చడం కోసం, ఎలాంటి స్కామ్ జరగకపోయినా, వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.