“అందుకే చంద్రబాబుకి పెద్దిరెడ్డి అంటే కోపం”:జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు. కాగా జగన్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి అంటే చంద్రబాబుకి పీకల దాకా కోపం ఉందన్నారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి చంద్రబాబుని కొట్టారని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కోపం చంద్రబాబుకి ఇప్పటికీ ఉందని జగన్ తెలిపారు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటారన్నారు. అందులో భాగంగానే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దహనం కేసులో పెద్దిరెడ్డి కుటుంబంపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.


 
							 
							