‘దానివల్లే నా మనసు విరిగిపోయింది’..మంచు మనోజ్
మంచు ఫ్యామిలీ వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. పోలీసులు, కోర్టులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. అన్నదమ్ములు, తండ్రీ కొడుకులే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంతో వారేం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ అసలు తన మనసు విరిగిపోవడానికి కారణం పేర్కొన్నారు. తన పోరాటం ఇల్లు, ఇతర ఆస్తులపై కాదన్నారు. వాటిపై తనకు ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన అన్న విష్ణుకు సంబంధించిన సంస్థలే తన తండ్రి మోహన్ బాబుకు నటించిన, నిర్మించిన అన్ని సినిమాలకు పనిచేస్తున్నాయన్నారు. అలాగే సన్నాఫ్ ఇండియా అనే చిత్రంలో ఒక పాట గ్రాఫిక్స్‌కు రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టారని, దానిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా చేయొచ్చని చెప్పినందుకు తనపై కక్ష కట్టారన్నారు. ఈ గొడవలలో తన భార్యను, నెలల బిడ్డను కూడా లాగారని మండిపడ్డారు. విష్ణు స్టేట్‌మెంట్, ఎఫ్‌ఐఆర్‌లో తన భార్యాబిడ్డల పేర్లు పెట్టడం వల్లే తన మనసు విరిగిపోయిందన్నారు. తనపై 30 తప్పుడు కేసులు పెట్టారని, రెండేళ్లుగా ఈ తగాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Tollywood news: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 12న విడుదల..

