‘ఆ వీడియో నాది కాదు’..నటి
‘లగ్గం’ హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీకయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రగ్యా స్పందించారు. తన పేరిట ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలు తనవి కావని ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసేవారిని చూస్తే జాలేస్తుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మన జీవితాలకు ఉపయోగపడాలి కానీ, జీవితాన్ని దుర్భరం చేయకూడదని పేర్కొన్నారు. ఈ వీడియోలను వ్యతిరేకిస్తూ హ్యాష్ ట్యాగ్ ప్రగ్యానగ్రా పేరిట ట్విటర్‌లో ఆమెకు అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హర్యానాకు చెందిన ఆమె తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు.

