Home Page SliderTelangana

ఆ ఊరికి కవలలతో ప్రత్యేక గుర్తింపు..

జీవితంలో తల్లిదండ్రులు అవడం ఎంతో ప్రత్యేకం. అయితే.. ఒకే కాన్పులో కవలలు పుట్టడం కంటే గొప్ప ఆనందం ఏముంటుంది. ఒకప్పుడు కవలలు చాలా అరుదుగా పుట్టేవారు. కానీ నేడు కవలలు పుట్టడం సాధారణ విషయంగా మారింది. పుట్టిన కవల పిల్లలు ఒకే పోలికలతో ఉంటే మోనోజైగోటిక్, వేర్వేరు పోలికలతో డైజీగోటిక్ అని వ్యవహరిస్తారు. అయితే.. ఓ గ్రామం కవలలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో పది మందికి పైగా కవలలు కనువిందు చేస్తుండటంతో ఆ ఊరికి ప్రత్యేకత సంతరించుకుంది.ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఉండడంతో గ్రామస్తులే కాదు తల్లిదండ్రులే గుర్తు పట్టలేని పరిస్థితి ఉంటుందట. ఆ కవల పిల్లలకు వారి తల్లిదండ్రులు పేర్లు కూడా ఆకర్షణీయంగా పెట్టారు. గౌతమి – గాయత్రి, వర్షిత్ – హర్షిత్, కావ్య – దివ్య, రామ్ – లక్ష్మణ్ ఇలా ఉండటంతో పాఠశాలలోని టీచర్లు కూడా పోల్చుకోలేక తికమక పడుతున్నారట. గ్రామంలో కవలలు ఎక్కువగా ఉండటంతో జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా నిలవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు.