Horoscope TodayNews

అందుకే ఆ రాశి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది

సెప్టెంబర్ 22 రాశి ఫలాలు

మేష రాశి : పనులలో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు కానీ వాటిని అధిగమించే ధైర్యం ఉండాలి. వివాదాలకు లేదా వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు నేటి పరిస్థితులు కంగారు పెడతాయి. మీ ఆగ్రహాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పనులలో తొందరపాటు తగదు. ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.

వృషభ రాశి : మొదలు పెట్టిన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం అభివృద్ధి దశలో ఉంది. మొండి బాకీలు అనగా దీర్ఘకాలిక రుణాలు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు తీరుతాయి.ఆలయాలను సందర్శించడం వలన మంచి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం లేదా కుటుంబంలో సమస్యలు వేధిస్తుంటాయి.

మిధున రాశి : ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి ఉండకపోవచ్చు చిన్న విషయాలకు ఇతరుల మీద ఆధారపడొద్దు. వ్యాపారంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటారు. ఒక సమస్య అనేది బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అనుకోని సంఘటనల వల్ల ఆర్ధిక నష్టం. కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములు లేదా కోర్టు లో ఉన్నటువంటి సమస్యలు తీరే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంది కీలక నిర్ణయాల్లో భాగస్వామి సలహాలు తీసుకోవాలి. హామీలు లేదా మధ్యవర్తిత్వాలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ప్రయాణాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తుంటాయి.

సింహరాశి: కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు కూర్చొని పరిష్కారం చేసుకోగలరు మొదలు పెట్టిన పనులు అంత చురుకుగా సాగవు సాగవు. ప్రస్తుత పరిస్థితులు మీకు అనుగుణంగా మార్చుకోవాలి. ఆస్తి వివాదాలు తీరతాయి. పాత మిత్రులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది.

కన్యారాశి: మిత్రులు లేదా భాగస్వామితో వచ్చిన విరోధులను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు లేదా పెట్టుబడులలో తొందరపాటు వద్దు ఆరోగ్య పరిస్థితి కొంతవరకూ బాగుంటుంది. కొంతమంది తప్పుదోవ పట్టించడానికి లేదా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి.

తులారాశి : అనుకోని సంఘటనలు ఆశ్చర్యకర పరిణామాలు ఈరోజు చోటుచేసుకుంటాయి. కొన్ని సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది. శ్రమకు తగ్గ ఫలితం పలుకుబడి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి విద్యార్థులు లక్ష్యం నిర్దేశించు కొవాలి.

వృశ్చిక రాశి : సంతాన సమస్యలు తీరుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది. వ్యాపార క్రయ విక్రయాలలో లాభాలు కలుగుతాయి. కుటుంబ బాధ్యతలు, అదనపు రాబడి ఉంటుంది. అవసరాలు తీరుతాయి. పనులను వాయిదా వేయవద్దు. మహిళలకు సంఘంలో గౌరవం కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలలో ప్రమోషన్లు.

ధనుస్సు రాశి : జీవితానికి సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆస్తి వివాదాలు పోయి లాభం పొందుతారు బంధువులు కుటుంబ సభ్యులు నుండి చికాకులు ప్రయాణాలలో ఆటంకాలు శారీరక ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కొన్ని సార్లు మంచి చేసినా విమర్శలు వస్తుంటాయి. ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు పరిచయం లేని వ్యక్తుల వలన మోసపోయే అవకాశం ఉంది.

మకర రాశి : చదువులు ఉద్యోగాలలో ఏకాగ్రత దాని పనులు సకాలంలో పూర్తి అయితే గౌరవం పెరుగుతుంది.. చేపట్టిన పనులలో ఎదురైనా పని పూర్తి చేస్తారు. ఆదాయం అంతగా కలిసి రాదు. అనుకోని ప్రయాణాలు వల్ల శారీరకంగా అలసిపోతారు. ఉద్యోగస్తులకు అదనపు ఒత్తిడి మహిళలకు మానసికంగా అశాంతి.

కుంభ రాశి :కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఆదాయం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేస్తారు. నిరుద్యోగులు లేదా విద్యార్థులు ఏకాగ్రత వహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలి. పని మధ్యలో శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు ఒత్తిడి ముఖ్యమైన నిర్ణయాలు జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి కొంతవరకు చేరే అవకాశం ఉంది.

మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం సేవా సమితి
9849485645