Home Page SliderNationalPolitics

‘ఆ రాష్ట్రాల భాషలు అందుకే కనుమరుగైపోయాయి’. సీఎం సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు సీఎం స్టాలిన్ హిందీ భాష వ్యాప్తిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా ఉత్తరాది భాషలన్నింటినీ హిందీ కబళించిందని, హిందీ వ్యాప్తితోనే దాదాపు 25 ఉత్తరాది మాతృభాషలు కనుమరుగైపోయాయని వ్యాఖ్యానించారు. హిందీ ఒత్తిడి ప్రాచీన మాతృభాషలను చంపేసిందన్నారు. యూపీ, బీహార్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు కూడా హిందీ భాష వ్యామోహంలో మాతృభాషలను కోల్పోయాయని పేర్కొన్నారు. వాటి అసలైన భాషలు ఇప్పుడు మాట్లాడేవారే లేరన్నారు. భోజ్ పురి, అవథి, బ్రాజ్, మాల్వి, మార్వాడి, సంతాలి, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, ముండారి, బందేలి, గర్హవలి, కురుఖ్ వంటి భాషల ఉనికి ప్రశ్నార్థకమయిందని స్టాలిన్ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా జాతీయ విద్యావిధానంపై తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.