Home Page SliderInternationalSports

రోహిత్ తప్పుకోవడానికి కారణం అదే..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ రోహిత్ శర్మ విషయంలో భారత్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు చేశాడు. సిడ్నీ టెస్టులో రోహిత్‌ విశ్రాంతి కోసం బెంచ్‌పై కూర్చున్నాడని ప్రస్తుత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రా తెలిపారు. ఇప్పటికీ తమ కెప్టెన్ రోహితేనని వ్యాఖ్యానించారు. అయితే కామెంటర్లు రవిశాస్త్రి, గావస్కర్లు మాత్రం రోహిత్ తన చివరి టెస్టు మెల్‌బోర్న్‌లో ఆడేశాడని వ్యాఖ్యానించారు. దీనితో కీలకమైన ఐదో టెస్టులో కెప్టెన్ విశ్రాంతి తీసుకోవడం జరగదని, అతనని తప్పించారని ఆస్ట్రేలియా విమర్శిస్తోంది. కీలకమైన నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లో లేకపోవడంతో రోహిత్ మ్యాచ్‌ మిస్సయ్యాడని టేలర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై గావస్కర్ మాట్లాడుతూ జట్టు విజయం కోసం రోహిత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇలాంటి మొదటి కెప్టెన్ రోహిత్ అయ్యిండొచ్చని పేర్కొన్నాడు.