దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. అయితే మొన్నటి వరుకు క్రమంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో బంగారం ఇకపై సామాన్యులకు అందని ద్రాక్షలా మారిపోయింది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా తగ్గిన బంగార ధర..ఈ రోజు ఒకేసారి రూ.300పైగా పెరిగింది. కాగా పెరిగిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760కి పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400 పలుకుతుంది. మరోవైపు ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.60,760 వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా వెండి ధర రూ.80,400 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,850 గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.60,910 వద్ద కొనసాగుతున్నది.