Home Page SliderTelangana

ఆ ఐకానిక్‌ భవనం ఇక కనిపించదు!

సికింద్రాబాద్‌ అంటే గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్‌ భవన నమూనా. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలను ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో నాటి కళాసంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా ఎయిర్ పోర్టు తరహాలో రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చాలన్నది సౌత్ రైల్వే సంకల్పం. నిత్యం 180 రైళ్లు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్ ను 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టి లో ఉంచుకుని పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.