Home Page SliderNational

విశ్వంభరలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇది కూడా హిట్టే!

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్లే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుస సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను తెరకెక్కించారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు.