Home Page SliderNational

ఆ హీరో అర్ధరాత్రి నా రూం తలుపు తట్టేవాడు..

బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్, రాజ్ శాండిల్య దర్శకత్వంలో తాజాగా రాబోతున్న మూవీ ‘విక్కీ విద్యా కా వో వాలా’. రాజ్ కుమార్ రావు, త్రిప్తి డిమీ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మల్లికాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘దుబాయ్ లో ఓ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు తనతో కలిసి నటిస్తున్న హీరో అర్ధరాత్రి 12 గంటలకు నా రూం తలుపు తట్టాడు. బెడ్ రూంలోకి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నేను తలుపు తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. తర్వాత మళ్లీ ఆ హీరోతో కలిసి పనిచేయలేదు” అని చెప్పుకొచ్చింది.