Home Page SliderTelangana

ఆ పరీక్షను కూడా రద్దు చేయాలి

దేశవ్యాప్తంగా TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. కాగా ఇది రాజేసిన అగ్గి తెలంగాణా రాష్ట్రంలో ఇంకా చల్లారలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోప్రతి నిత్యం నిరుద్యోగుల నిరసనలతో TSPSC కార్యాలయం అట్టుడుకుతూనే ఉంది. కాగా TSPSC రాష్ట్రంలో జరిగిన పలు పరీక్షలను రద్దు చేసింది. అలాగే జరగాల్సిన మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే వాటితోపాటు ఈ నెల 25న జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికల్ పరీక్షను కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.  ఈ మేరకు వారు TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని  కలిసి విజ్ఞప్తి చేశారు. TSPSC పేపర్ లీక్ నిందితుల పెన్‌డ్రైవ్‌లో AMVI ప్రశ్నాపత్రం కూడా ఉందని వారు అనుమానం చేస్తున్నారు. దీంతో ఈ పరీక్షను కూడా వాయిదా వేయాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు.