Home Page SliderNational

“నాకు ఉత్తమ బహుమతిని అందించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు”: డీకే

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడగా సీఎం అభ్యర్థి ఎవరా అని అంతటా సందిగ్ధత నెలకొంది. కాగా ఈ రోజు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా  కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ,పార్టీ నేతల సమక్షంలో డీకే శివకుమార్  కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలను ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నా జీవితం కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికే అంకితం. నా పుట్టినరోజు సందర్భంగా కర్ణాటక ప్రజలు నాకు ఉత్తమ బహుమతిని అందించారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సి వుండగా..ఎవరిని సీఎంగా ప్రకటిస్తారో అని కర్ణాటకతోపాటు  దేశంలోని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.