Home Page SliderTelangana

హైకమాండ్ కు థాంక్స్.. నా జీవితం తెలంగాణకే అంకితం చేశాను..

తన జీవితం మొత్తాన్ని తెలంగాణకే అంకితం చేశానని కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆమె ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ పై ఎన్ని రకాలుగా పోరాడాలో అన్ని రకాలుగా పోరాడాను. ఉద్యమం పేరుతో కేసీఆర్ జనాలను మోసం చేసి సంపదను దోచుకున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నా రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. నాకు ఎమ్మెల్సీగా బాధ్యత ఇచ్చారు నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతాను. సరైన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు హైకమాండ్ కు ధన్యవాదాలు’’ అని విజయశాంతి పేర్కొన్నారు.