Home Page SliderTelangana

50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్ , ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంను కలిసినవారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఇతర ముఖ్యులు ఉన్నారు.