Andhra PradeshHome Page SliderPolitics

‘చంద్రబాబు, పవన్‌లకు కృతజ్ఞతలు’..బొత్స

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పాఠశాలు  ఎంతో అభివృద్ధి చెందాయని, ఆ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకున్నారని తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరంట్- టీచర్స్ మీటింగ్ సందర్భంగా ప్రజలకు గతంలో నాడు-నేడు ద్వారా చేసిన అభివృద్ధిని చూపించారని పేర్కొన్నారు. అలాగే మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్తే బాగుండేదన్నారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణలు జరిపి ఏ జరగలేదన్నారు. అనవసరంగా వైసీపీ హయాంలో స్కామ్‌లు జరిగిపోయాయంటూ లేనిపోని ఆరోపణలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఏదైనా జరిగితే నిరూపించి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.