తెలంగాణాలో టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణా ప్రభుత్వం ఇటీవల కాలంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉపాధ్యాయ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే దీని ప్రకారం రేపటి నుంచి ఈ నెల 16 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 27 న ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.