సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. దీనితో ఎన్ఐఏ బృందాలు అక్కడ సోదాలు చేశారు. ధర్మవరం ఊరిలోని కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని ఓ హోటల్ లో వంటమనిషిగా పనిచేస్తున్న నూర్, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. నూర్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా అతను ఎవరితో సంప్రదింపులు జరిపాడు అనే దానిపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం నూర్ ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు ధర్మవరంలో నూర్ అనే యువకుడికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది. గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో

