మహారాష్ట్రలో టెర్రర్ ట్రక్కు విధ్వంసం-12 మంది మృతి
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఓ ట్రక్కు వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయి 12 మంది ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. ఈ ట్రక్కు ముంబయ్- ఆగ్రా హైవేపై ఈ ట్రక్కు బీభత్సం సృష్టించింది. నేటి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇది మధ్యప్రదేశ్ నుండి ధులే వైపుగా వెళ్తోండగా, ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. దానివల్ల డ్రైవర్ ఈ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీనితో వేగంతో ఉన్న ట్రక్కు రెండు బైకులు, కారు, మరో కంటైనర్‌ను ఢీకొట్టుకుంటూ రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.

