Home Page SliderNational

భయానకంగా బిపోర్‌జోయ్.. పలురైళ్లు రద్దు

బిపోర్‌జోయ్ తుపాన్ భయానకంగా మారింది. బలమైన ఈదురుకాలులు, భారీ వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్ర తీర ప్రాంతాలనుండి 75 వేల మందిని తరలించారు. గుజరాత్, ముంబై వైపు వెళ్లే 70 రైళ్లను రద్దు చేశారు. ఈ రోజు సాయంత్రానికి తుపాన్ కచ్ సమీపంలోని మాండ్వి- పాకిస్థాన్‌లోని జఖౌ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హుద్‌హుద్ తుపాన్ కూడా తీరంపై ఇంతే వేగంతో విరుచుకు పడింది. దీనితో చాలా ఆస్థి నష్టం జరిగింది. ఇప్పుడు కూడా జరిగే ప్రమాదాలున్నాయని, సముద్రం అల్ల కల్లోలంగా మారిందని హెచ్చరించారు భారత వాతావరణ శాఖ IMD. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలలో సాయంత్రం వరకూ బీభత్సంగా ఉండబోతోంది. ఈ తుపాన్ అరేబియా సముద్రంలో ఎక్కువ కాలం కొనసాగినట్లు రికార్డు సృష్టించనుంది. దీనితో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆలయాలు, కార్యాలయాలు, మూసివేశారు.  హైఅలర్ట్ ప్రకటించారు.  ఈ తుపాన్‌కు సంబంధించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి ఫొటోలు విడుదలయ్యాయి.