ఉట్నూర్‌లో టెన్త్ పేపర్స్ ఆన్సర్ షీట్స్ బ్యాగ్ మిస్సింగ్
తెలంగాణాలో పరీక్షల నిర్వహణ తీరు అయోమయంగా ఉంటోంది. టిఎస్‌పిఎస్‌సీ పేపర్ లీకేజి ఘటన ఇంకా మరువక ముందే పదవతరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతుండగానే ఇప్పుడు మళ్లీ పదవతరగతి ఆన్సర్ షీట్స్ బండిల్ మిస్సయ్యింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగింది. 10 వ తరగతి జవాబు పత్రాల బండిల్స్ రెండు పల్లెటూర్ల నుండి ఒక ఊరి నుండి 6, మరో ఊరి బండిల్స్ 5 కలిపి మొత్తం 11 బండిల్స్ ఉన్నాయని, వాటిని ఉట్నూరు పోస్టాఫీసులో బుక్ చేసారని, అక్కడి నుండి ఆటోలో బస్టాండుకు పంపిస్తున్నారని, ఆసమయంలోనే ఒక బండిల్ మిస్సయిందని సమాచారం. ఈ ఘటనలో పోస్టు మాస్టర్ రజితపై కేసు నమోదు చేశారు. తనకేమి తెలియదంటూ ఆమె వాపోయారు. తాము లెక్కపెట్టినప్పుడు 11 బండిల్స్ ఉన్నయంటున్నారు. ఇది తపాలాశాఖ నిర్లక్ష్యం అంటున్నారు విద్యాశాఖ. ఈ జవాబు పత్రాలు తెలుగు పేపర్‌కు సంబంధించినవని తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని, పోలీసుల దర్యాప్తును అనుసరించి చర్యలు తీసుకుంటామని, డీఈవో తెలియజేస్తున్నారు. దీనిపై విద్యార్థులను ఆందోళన చెందవద్దని, వారికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.