బెయిల్‌పై విడుదలైన టెన్త్ పేపర్‌లీక్ నిందితులు
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన నిందితులు ప్రశాంత్, మహేశ్, గణేష్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో ఏ2 గా పేర్కొన్న ప్రశాంత్ తానెలాంటి తప్పూ చేయకుండానే తనపై అన్యాయంగా కేసుపెట్టారని మీడియాకు తెలియజేశారు. తనకు వాట్సాప్‌లో పేపర్ పరీక్ష మొదలైన తర్వాతే వచ్చిందని, ఉదయం 10.05 గంటలకు ఈ పేపర్ వస్తే తాను 10,45 గంటలకు చూశానని, దానిని ఒక జర్నలిస్ట్‌గా మాత్రమే పదిమందికీ షేర్ చేశానని పేర్కొన్నారు. బండి సంజయ్‌తో కేవలం నలభై సెకన్లు మాత్రమే మాట్లాడానని,కానీ పోలీసులు వందలసార్లు మాట్లాడినట్లు చెప్తున్నారని వాపోయారు. బండి సంజయ్ కోరినట్లు కేవలం ప్రెస్ నోటి రాసిచ్చానని, దీనిలో దురుద్దేశం ఏదీ లేదన్నారు. తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేకంగా ఏం వచ్చినా గవర్నమెంటు తట్టుకోలేకపోతోందని ఆరోపించారు. దీనివల్లనే సీపీ రంగనాధ్ తనను బండి సంజయ్‌కు వ్యక్తిగత సలహాదారునని ఆరోపిస్తున్నారన్నారు. తనకు కోర్టు షరతులతో బెయిల్ ఇచ్చిందని, న్యాయవాదులతో మాట్లాడి తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తానన్నారు.

